18 April, 2026 | 11:05 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

28-05-2025 12:43 AM

 అందుబాటులో టెన్త్ హాల్ టికెట్లు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 42,832 మంది వద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 26,286 మంది బాలురు, 16,546 మంది బాలికలున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను స్కూల్ ప్రధానోపాధ్యాయుల నుంచైనా, లేదా వెబ్‌సైట్ నుంచైనా తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.