మూర్ఛకు ‘కేర్’లో అధునాతన చికిత్స
- వీఎన్‌ఎస్‌తో వ్యాధిని అదుపులోకి తెచ్చిన హాస్పిటల్స్ వైద్యులు
- చిన్నప్పటి నుంచి బాధపడుతున్న 34 ఏళ్ల మహిళకు కొత్త జీవితం
హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో మందులతో అదుపులోకి రాని క్లిష్టమైన మూర్ఛ (ఎపిలెప్సీ) వ్యాధికి అత్యాధునిక వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ (వీఎన్‌ఎస్) చికిత్స ద్వారా విజయవంతంగా వైద్యం అందించారు. చిన్నప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ మూర్ఛలతో బాధపడుతున్న వరంగల్‌కు చెందిన 34 ఏళ్ల మహిళకు ఈ చికిత్సతో కొత్త జీవితం లభించింది.మూర్ఛలు గణనీయంగా తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి, ప్రవర్తన, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యం మెరుగుపడి, ఆమె మళ్లీ స్వతంత్రంగా జీవించడం ప్రారంభించింది.
ప్రతిమకు ఆసుపత్రిలోని ఎపిలెప్సీ నిపుణుల బృందం అన్ని పరీక్షలు చేసిన తర్వాత సాధారణ మెదడు శస్త్రచికిత్స చేయడం సాధ్యం కాదని నిర్ధారించింది. ముందుగా మందులను మార్చి, మోతాదులను సరిచేయడం ద్వారా మూర్ఛలను దాదాపు 90 శాతం వరకు తగ్గించారు. అయినప్పటికీ కొన్నిసార్లు మూర్ఛలు రావడంతో వీఎన్‌ఎస్ చికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స చేయలేని ఇలాంటి రోగులకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న, అమెరికా ఎఫ్డీఏ ఆమోదించిన చికిత్స ఇదే.
ఈ చికిత్సలో ఛాతీ చర్మం కింద చిన్న పరికరాన్ని అమర్చి, మెడలోని ఒక నరానికి స్వల్ప విద్యుత్ సంకేతాలు పంపిస్తారు. దీంతో మూర్ఛలకు కారణమయ్యే మెదడు సంకేతాలను నియంత్రించవచ్చు. చికిత్స విజయవంతంగా పూర్తయింది.ఇప్పుడు ఆమె తన పనులను తానే చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతోంది. దీంతో కుటుంబ సభ్యులపై ఉన్న భారం కూడా గణనీయంగా తగ్గింది. కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో ఎపిలెప్సీ అండ్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శశాంక్ జైస్వాల్ మాట్లాడుతూ మందులతో మూర్ఛలు తగ్గకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిమకు సాధారణ శస్త్రచికిత్స సాధ్యం కాకపోవడంతో వీఎన్‌ఎస్ చికిత్స చేశాం.
ఆ తర్వాత మూర్ఛల నియంత్రణతో పాటు జ్ఞాపకశక్తి, ప్రవర్తన, స్వతంత్రంగా జీవించే సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇలాంటి రోగులు సకాలంలో నిపుణులను సంప్రదిస్తే ఆధునిక చికిత్సలతో మంచి ఫలితాలు సాధించవచ్చు‘ అని తెలిపారు.
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి మాట్లాడుతూ, ‘అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో క్లిష్టమైన మూర్ఛ వ్యాధిగ్రస్తులకు కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వీఎన్‌ఎస్ వంటి ఆధునిక చికిత్సలతో ఎన్నో కుటుంబాలకు కొత్త ఆశను కల్పిస్తున్నాం‘ అని అన్నారు.






