రోబోట్‌తో గుండె మైట్రల్ వాల్వ్ మార్పిడి
గచ్చిబౌలి కిమ్స్‌లో 37 ఏళ్ల యువకుడికి ఆరుదైన సర్జరీ
హైదరాబాద్, ఆగస్టు ౧(విజయక్రాంతి): కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి వైద్యులు రోబోటిక్ సహాయంతో మైట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రాజమండ్రికి చెందిన 37 ఏళ్ల యువకుడికి చేసిన ఈ శస్త్రచికిత్స గచ్చిబౌలి కిమ్స్‌లో తొలిసారి నిర్వహించటమే కాకుండా, హైదరాబాద్‌లో అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్సల్లో మరో మైలురాయిగా నిలిచింది.
శనివారం విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను రోబోట్ సర్జరీ చేసిన చీఫ్ కార్డియోథొరాసిక్, రోబోటిక్, మినిమల్ ఇన్వేసివ్ సర్జన్ డాక్టర్ నిసర్గ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రాంతానికి చెందిన రొయ్యల ఎగుమతి సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల యువకుడు చా లా కాలంగా దీర్ఘకాలిక రుమాటిక్ గుండె వ్యా ధి కారణంగా తీవ్రమైన మైట్రల్ స్టెనోసిస్‌తో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం మోస్తరు మైట్రల్ స్టెనోసిస్‌గా నిర్ధారణ కావడంతో కిమ్స్ గచ్చిబౌలి కార్డియాలజీ విభాగం పర్యవేక్షణలో మందులతో చికిత్స పొందుతున్నాడు.
వ్యాధి తీవ్రత పెరగడంతో గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇ బ్బంది వంటి లక్షణాలు ఎక్కువవడంతో ఆ పరేషన్ అవసరమైంది. జూలై 23న నిర్వహించిన ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స సుమారు ఐదు గంటలకు పైగా సాగింది. రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ శస్త్రచికిత్సలు హైదరాబాద్‌లో ఇప్పటికీ చాలా అరుదుగా జరుగుతున్నాయన్నా రు.
సాధారణ ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలో ఛాతీ ఎముకను కోయాల్సి వస్తుంది. కానీ రోబోటిక్ విధానంలో చిన్న రంధ్రాల ద్వారానే శస్త్రచికిత్స చేయడం వల్ల రక్తస్రావం తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్ ప్రమాదం త గ్గడం, నొప్పి తక్కువగా ఉండటం, త్వరగా కోలుకునే అవకాశం లభిస్తుందన్నారు.
శస్త్రచికిత్స జరిగిన కొ న్ని గంటల్లోనే వెంటిలేటర్ తొలగించగా, మరుసటి రోజే రోగి నడవగలిగాడనారు. శస్త్రచికి త్స బృందంలో కార్డియాక్ సర్జన్ డాక్టర్ వినీత్, కార్డియాక్ అనస్తీషియాలజిస్టులు డాక్టర్ దివ్య, డాక్టర్ గోరింత, డాక్టర్ భవాని, సీనియర్ సర్జికల్ అసిస్టెంట్ మనోహ్, సీనియర్ క్లినికల్ పె ర్ఫ్యూషనిస్టులు దయాకర్ స్వామి, జగన్మోహ న్, జూనియర్ పెర్ఫ్యూషనిస్ట్ అభిషేక్ పాల్గొన్నారు.






