24 April, 2026 | 12:17 PM

Breaking News

బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

ఏఈఏపీఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ యూనిట్

01-01-2025 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహి స్తున్న ఏఈఏపీఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఏఈఏపీఎల్ ఎయిర్‌పోర్టులు కలిగిన భారత్ లేదా ప్రపంచంలో ఇతర దేశాల్లో స్థానిక ప్రభుత్వాల మద్దతుతో ఇంజిన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచంలో పలు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ సంస్థల్లో రష్యాకు చెందిన పెర్మ్ ఇంజిన్స్‌కు చెందిన పీడీ 14 ఇంజిన్లను తయారు చేసే యూనిట్ నెలకొల్పాలని ఏఈఏపీఎల్ గ్రూప్ కంపెనీల సీఎండీ మనీశ్ కపూర్ నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. ఈ ఇంజిన్ల తయారీ కోసం ఏఈఏపీఎల్ జాయింట్ వెంచర్ ప్రతిపాదనా ఒప్పందంపై రష్యా నగరం పెర్మ్‌లో పెర్మ్ ఇంజిన్స్ కేంద్ర కార్యాలయంలో సంతకాలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.