వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఏఈవో ఆత్మహత్య
చిట్యాల, మే 28: వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవసాయ శాఖలో ఏఈవోగా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాల రాజు (38) వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తూ ప్రస్తుతం కేతపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు.
వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిపారు. అప్పు ఇచ్చిన వ్యక్తులు అధిక వడ్డీ లెక్కలు చూపుతూ, మోసపూరితంగా చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని డ బ్బు కావాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారన్నారు. వడ్డీ వ్యాపారులు, చిట్ఫండ్ ఏజెంట్ల వేధింపులు భరించలేక బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కే. నాగరాజు, ఎస్‌ఐ మామిడి రవికుమార్ తెలిపారు. కాగా మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.






