29 May, 2026 | 2:53 AM

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

29-05-2026 01:03 AM

గరిడేపల్లి, మే 28: మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున దాత గుండు వంశీ గౌడ్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి రామనాథం గౌడ్, ఉపసర్పంచ్ చిత్తలూరి వీరస్వామి చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం గ్రామ సర్పంచ్ రామనాథం గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకి రావద్దని సూచించారు. కార్యక్రమంలో వార్డు నెంబర్ దొంతగాని తార లక్ష్మయ్య, ఫీల్ అసిస్టెంట్ మేరీగ శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.