ఫ్యూచర్ సిటీకి ‘ఆగాఖాన్’ మెరుగులు

16-09-2026 | 05:15am
  1. ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-Vతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
  2. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఆగాఖాన్‌కు ఆహ్వానం

హైదరాబాద్ సిటీ బ్యూరో 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో పర్యాటకం(tourism), విద్య(education), వైద్యరంగాల(healthcare sectors) విస్తరణతోపాటు చారిత్రక సంపద పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మంగళవారం తాజ్‌ఫలక్‌నామా ప్యాలెస్‌లో ప్రిన్స్ హ్రీమ్ ఆగాఖాన్(Prince Karim Aga Khan)--Vతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఇటీవల దివంగతులైన ఆగాఖాన్--IV మృతి పట్ల సీఎం తన సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ(India Future City) వేదికగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Telangana Global Summit)’కు ఆగాఖాన్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

వారసత్వ సంపద పరిరక్షణ

గతంలో ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుతుబ్‌షాహీ టూంబ్స్, శాసనమండలి భవనాలను విజయవంతంగా పునరుద్ధరించుకున్నామని సీఎం గుర్తుచేశారు. అదే తరహాలో మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు ఫౌండేషన్ సహకారాన్ని కోరారు. ఉస్మానియా ఆసుపత్రికి గోషామహల్‌లో నూతన భవనం నిర్మిస్తున్నామని, పాత భవనాన్ని వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఈసా, మూసా నదుల సంగమమైన మూసీని కాలుష్య రహితంగా మార్చి, ‘నైట్ ఎకానమీ’ డెవలప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే కాకుండా, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 2.5 శాతం నుండి 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల దూరంలో 30వేల ఎకరాల్లో ఈ నెట్-జీరో స్మార్ట్ సిటీ రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

ప్రాజెక్టులో ఏకంగా 15,000 ఎకరాలను గ్రీన్ జోన్‌గా కేటాయించినట్లు చెప్పారు. సింగపూర్ సంస్థ ఈ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని వెల్లడించారు. అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ప్రతిపాదించారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వాణీప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు