6 July, 2026 | 9:19 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

ఉపాధి హామీ కూలీల కూలీరెట్లు పెంచాలి

30-05-2025 06:27 PM

నిర్మల్(విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న కూలీలకు కూలి రేట్లు 600 నుంచి 1200 కు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, నరసయ్య తదితరులు మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల్లో వస్తున్న సమస్యలను పరిష్కరించాలని, రోజుకూలి రూ.600 చెల్లించాలని సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని పేర్కొన్నారు.

ఉపాధి హామీ కూలీల, ఫీల్డ్ అసిస్టెంట్ ల ఇతర సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కూలీలకు గడ్డపార, తట్ట, పారా పనిముట్లు కొనుగోలు చేసి ఇవ్వాలి. ఉపాధి బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని, ఉదయము సాయంత్రం రెండు ఫోటోలు తీసి పంపాలనే నిబంధనలను తొలగించాలని డిమాండ్  చేయడం జరిగింది.