22-02-2026 12:10:55 AM
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): అధునాతన సాంకేతిక రంగాన్ని వాడుకుంటూ రైతులకు మేలు చేకూర్చే విధంగా అనేక రకాల నూతన పద్ధతులు అవలంబిస్తూ వాటిని దేశంలోని నలుమూలల రైతులకు చాటి చెప్పడంలో ముందు వరుసలో ఉన్న ముల్కనూర్ సహకార బ్యాంక్ అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డికి అగ్రికల్చర్ ఇన్నోవేషన్ అవార్డును పార్థ ప్రతి మ దాస్ చీఫ్ కన్సల్టెంట్ పీజీఐ అవార్డు అందజేశారు.
పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రైతులకు మేలు చేకూర్చే విధంగా అనేక గ్లోబల్ అడ్వైజరీ కమిటీ పథకాలు రూపొందించడంలో ప్రవీణ్ రెడ్డికి సాంకేతిక ఆవిష్కరణలు ఖచ్చితమైన వ్యవస్థ డ్రోన్లు, ఎల్‌ఓటీ సెన్సార్లు జీపీఎస్ ద్వారా అవసరమైన చోట మాత్రమే నీరు, ఎరువులు వాడటం. కృత్రిమ మేధో సంపత్తి వాతావరణం చీడపీడల గురించి ముందే అంచనా వేయడం. అగ్రి-టెక్ స్టార్టప్లు: విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు డిజిటల్ పరిష్కారాలను అందించడం.సుస్థిర పద్ధతులు సేంద్రియ ప్రకృతి వ్యవసాయం రసాయనాల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచడం. నీటి యాజమాన్యం బిందు సూక్ష్మ సేద్యం ద్వారా నీటి వృథాను అరికట్టడం. సమగ్ర చీడపీడల నివారణ పర్యావరణానికి హాని కలగకుండా జీవ నియంత్రణ పద్ధతులు వాడటం ప్రయోజనాలు ఉత్పత్తి పెరుగుదల- తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి.