11 March, 2026 | 3:55 PM

Breaking News

విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •   పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి   •   గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •  

బీజేపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం!

22-02-2026 12:10 AM
  1. కాంగ్రెస్ గూండాల అరాచకం

బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ ధ్వజం

ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు హత్యాయత్నానికి ప్రయత్నించడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడారు.

ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై దాడి చేయడం అనేది చట్ట విరుద్ధమే కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

హిందువులు పూజలు చేయడం, హిందూ భక్తి గీతాలు వినిపించడం కూడా తప్పుగా చూపించే పరిస్థితి రాష్ర్టంలో నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయడానికి ఓ వర్గానికి చెందిన వారిపైనే కేసులు పెట్టడం సమంజసం కాదని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.