calender_icon.png 8 September, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్నుల వసూల్లో ముందు.. అభివృద్ధిలో ఆమడ దూరం..

08-09-2025 01:34:57 AM

అయిజ, సెప్టెంబర్,07:అయిజ మున్సిపల్ కేంద్రంలో ప్రజల వద్ద వసూలు చేసిన పన్నుల రూపంలో రాష్ట్రంలోనే ముందు వ రుసలో ఉన్న అభివృద్ధిలో మాత్రం చివరి స్థానంలో ఉందని గద్వాల జిల్లా బిజెపి మా జీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మడ్డి గుంట ప్రాం తాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

డ్రైనేజీ వ్యవస్థ పూడికతో నిండిపోవ డంతో మురుగునీరు బయటకు వెళ్లకుండా నిలిచి ఉండడంతో దీంతో పట్టణ ప్రజలు అ నారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపా రు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. నాయకులు కార్యక్రమంలో పట్టణ ఆధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ,నాయకులు పాల్గొన్నారు.