16 May, 2026 | 4:52 PM

మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్

16-05-2026 04:01 PM

- డిజిటల్ లెర్నింగ్’ కార్యక్రమం

కృత్రిమ మేధతోనే ఉపాధి అవకాశాల జోరు

 రేవంత్ డ్రీమ్ స్టార్ట్ రైస్ సంస్థ

మంథని,(విజయక్రాంతి): ప్రస్తుత ఆధునిక కాలంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - AI) రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంథని ‘డ్రీమ్ స్టార్ట్ రైస్’ సంస్థ అధికారి రేవంత్ పేర్కొన్నారు. మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" విద్యా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాల ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏఐ టూల్స్ డిజిటల్ లెర్నింగ్ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రేవంత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

భవిష్యత్తు అంతా కృత్రిమ మేధతోనే ముడిపడి ఉందని, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ లోని నూతన అంశాలను నేర్చుకోవడం ద్వారా మెండుగా ఉద్యోగ అవకాశాలను సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఏఐ అప్లికేషన్లను, వేర్వేరు రంగాలలో వాటి ఉపయోగాలు  ప్రయోజనాలను ఆయన ప్రాక్టికల్‌గా సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ  కోఆర్డినేటర్ కర్నాటి కృష్ణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆడెపు లక్ష్మీనారాయణ, చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు ముకుందం, శేఖర్, రాజు, సురేష్, పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.