27 February, 2026 | 3:55 PM

డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం

27-02-2026 02:32 PM

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (All India Anna Dravida Munnetra Kazhagam) నుండి బహిష్కరించబడిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (Dravida Munnetra Kazhagam)లో చేరారు. సీఎం స్టాలిన్(CM Stalin) పన్నీర్ సెల్వంకు కండువా కప్పి డీఎంకేలో ఆహ్వానించారు.

ఓపీఎస్ గా ప్రసిద్ధి చెందిన పన్నీర్ సెల్వం(O. Panneerselvam), తన కుమారుడు పి రవీంద్రనాథ్ కుమార్, మద్దతుదారులతో కలిసి డిఎంకెలో చేరారు. ఒకప్పుడు దివంగత ఎఐఎడిఎంకె అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు(J. Jayalalithaa) నమ్మకస్థుడిగా ఉన్న పన్నీర్ సెల్వం, తన మాతృసంస్థలో చేరడానికి మూడేళ్లకు పైగా ప్రయత్నించి విఫలమైన తర్వాత ఒకప్పుడు చిరకాల ప్రత్యర్థి డిఎంకెలో చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే కోశాధికారిగా పనిచేశారు, పార్టీ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. 2006లో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. దక్షిణాది నుంచి ఎవరు బలంగా మారకుండా చూడాలన్నదే పళనిస్వామి(Edappadi K. Palaniswami) లక్షమని పన్నీర్ సెల్వం అన్నారు. అన్నాడీఎంకేకు భవిష్యత్ లో విజయం దక్కకుండా పళనిస్వామి చేశారని ఆరోపించారు.