27 July, 2026 | 10:58 AM

వ్యక్తి అదృశ్యం కేసు నమోదు

27-07-2026 10:28 AM

పాపన్నపేట: గత రెండు రోజుల నుంచి వ్యక్తి కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఏఎస్సై దేవి దాస్ ఆదివారం తెలిపారు. మండల పరిధిలోని పాత లింగాయపల్లి గ్రామానికి చెందిన కొప్పోలు వెంకట్రామా గౌడ్(35) ఈనెల 24న పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, కుటుంబ సభ్యులు బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారన్నారు. ఎటువంటి సమాచారం లభించకపోవడంతో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో అతని అన్న కొప్పోలు సాయా గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.