28 February, 2026 | 2:10 PM

లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ

28-02-2026 12:52 PM

తొలి విడతలో 1200 ఇండ్ల పట్టాలను అందజేస్తాం.. 

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్ ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టాలు  పంపిని చేసారు, శనివారం షాద్ నగర్ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్‌నగర్ మున్సిపాలిటీలో ని 1,200 ఇళ్లను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. పట్టణంలోని 28 వార్డుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేశార ని,  ఇళ్లలో అన్ని సదుపాయాలు కల్పించామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులు గృహప్రవేశం చేయవచ్చని వెల్లడించారు. ఎక్కడ మంజూరైన వెళ్లాలని, ఒకవేళ అర్హులు ఎవరికైనా ఇల్లు రాకపోతే వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయినప్పటికీ అక్కడ పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించే ఉద్దేశంతోనే లబ్ధిదారులకు ఇళ్లను అందించే విషయంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే  అన్నారు.  అదేవిధంగా అక్కడ కాలువలు ఏర్పాటు, విద్యుత్ ఏర్పాటు, తాగునీటి సదుపాయం వంటివి కూడా కల్పించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఎనిమిది కోట్ల నిధులతో వాటన్నింటిని పూర్తి చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా దగ్గర ఉండి లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గృహాలు అందించే విషయంలో పారదర్శకంగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అర్హులకు ఇవ్వాల్సి ఉందని, ఇందిరమ్మ ఇల్లు అందని వారికి వాటిని అందించే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..

ఈ కార్యక్రమ్ లో మున్సిపాలిటీ చైర్మన్ అగ్గునూరు బస్వం, వైస్ చైర్మన్ అందే మోహన్, ఆర్డీవో సరిత, తహసిల్దార్ నాగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, కౌన్సిలర్లు సర్వర్ పాషా, నడికూడ శ్రావణి, వోగ్గు జయలక్ష్మి, పెంటయ్య, రాజు నాయక్,   స్థానిక నాయకులు అగనూరు విశ్వం, చెంది తిరుపతిరెడ్డి, సుజీవన్, దంగు శ్రీనివాస్, అగ్గనూరు నందు, ఇబ్రాహీం, జమాల్పూర్ చందు, తదితరులు  పాల్గొన్నారు.