27 June, 2026 | 7:46 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అనురాగ్ యూనివర్సిటీ కి ప్రతిష్టాత్మక ఎన్​పీటీఈఎల్ అవార్డు

28-02-2026 12:49 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ లోని ఎన్.పి.టీ.ఈ.ఎల్ లోకల్ చాప్టర్ కు స్వయం (ఎన్ పి టి ఈ ఎల్ ) నుండి టాప్ 200 కళాశాలు, విశ్వవిద్యాలయాల విభాగంలో ‘ఎ’ రేటింగ్‌తో అవార్డు లభించింది. ఈ గౌరవం విశ్వవిద్యాలయం యొక్క ఉన్నత విద్యా ప్రమాణాలు, ఆన్‌లైన్ కోర్సులలో విద్యార్థుల చురుకుగా పాల్గొనడం, నాణ్యమైన బోధనకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎన్ పి టి ఈ ఎల్ లోకల్ చాప్టర్ ఇంచార్జ్  డాక్టర్ ఎల్. శ్రీనివాసనాయక్, ప్రొఫెసర్ సుదర్శన్ అయ్యంగార్ (ఐఐటి మద్రాస్), ఎన్. పి. ఇ.యల్ కోఆర్డినేటర్  ప్రొఫెసర్  ఆండ్రూ తంగరాజ్ ( ఐ. ఐ.టీ. మద్రాస్) లచే అవార్డ్ అందుకున్నారు.   ఈసందర్భంగా ఆయనను  యూనివర్సిటీ సి.ఈ.ఓ ఎస్. నీలిమ, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయకుమార్, అసోసియేట్ డీన్ కె. శ్రీనివాస చలపతి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్. శ్రీనివాస నాయక్ యూనివర్సిటీ యజమాన్యం కు కృతజ్ఞతలు చెప్పారు.