మాందాపూర్ ప్రాథమిక పాఠశాల జాతీయ స్థాయికి నామినేట్
28-02-2026 12:14 PM
ప్రధానోపాధ్యాయులు చింతల ప్రభాకర్ ను సన్మానించిన జిల్లా కలెక్టర్
బీబీపేట,(విజయక్రాంతి): జాతీయస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఎస్ హెచ్ వి ఆర్ రేటింగులు కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిబిపేట మండలం మాందాపూర్ ప్రాథమిక పాఠశాల(Mandapur Primary School ) జాతీయ స్థాయికి నామినేట్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతల ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు జాతీయ స్థాయికి నామినేట్ అయిన మాందాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతల ప్రభాకర్ ను శాల్వా మెమెంటో తో ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రభుత్వ పాఠశాలను తీసుకెళ్లడం ఎంతో గొప్ప విషయం అన్నారు.




