21 March, 2026 | 5:41 AM

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం

16-12-2025 12:55 AM

475కి చేరిన వాయు నాణ్యత సూచీ

ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు

న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౫: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆదివారం నాటికి వాయు నాణ్యత సూచి 461కి చేరగా, సోమవారం రాత్రికి తీవ్రత మరింత పెరిగింది. వాయు నాణ్యత సూచిక 475కి చేరింది. కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నర్సరీ 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవే ఆదేశాలను పాటించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. 0- 50 మధ్య వాయు నాణ్యత సూచీ ఉంటే ఫర్వాలేదు. కానీ, ప్రస్తుతం ఢిల్లీలో ౪౭౫కి చేరుకోవడం స్థానికుల్లో ఆందోళన రేపుతున్నది.