calender_icon.png 16 December, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుళ్లకు విశ్రాంతినివ్వాలి!

16-12-2025 12:57:48 AM

పూజల పేరుతో ఆచారాలను పక్కన పెట్టొద్దు

ఆలయ నియమాలను పాటించాల్సిందే: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౫: ‘దేవతలకు విశ్రాంతి ఇవ్వకుండా పనిగట్టుకుని ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరమేంటి? ప్రతి ఆలయానికి కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ నియమాలను పాటించాల్సిం దే’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ బాంకీ బిహార్జీ ఆలయ ంలో దర్శన వేళలు. పూజా విధానాల్లో మార్పులను సవాల్ చేస్తూ ఓ భక్తుడు దాఖ లు చేసిన పిటిషన్‌పై సోమవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు తన వాదనలు వినిపిస్తూ.. బాంకీ బిహార్జీ ఆలయ నిర్వాహకులు డబ్బు కోసం దర్శన వేళలను మార్చివేశారని, మతపరమై న పూజా విధానాల్లోను మార్పులు చేసినట్లు కోర్టుకు విన్నవించారు. ధర్మాసనం స్పంది స్తూ.. ఆలయ నిర్వాహకులు డబ్బులు తీసుకుని పూజలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. కేసులో దర్యాప్తునకు ఉన్నత స్థాయి ఆలయ నిర్వహణ కమిటీని నియమించింది. ఆలయ నిర్వహణ కమిటీకి నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు కమిటీని ఆదేశించింది.