ఆకాశ వీధిలో ఎయిర్‌బస్ సీ295
తొలి ‘మేక్ ఇన్ ఇండియా’ సైనిక విమానం ఇదే
గాంధీనగర్, జూన్ ౧౧: గుజరాత్‌లోని వడోదర నగరంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి మరో ఘనత సాధించింది. భారత్‌లో తయారైన మొట్టమొదటి ‘ఎయిర్‌బస్ సీ295’ (ఱతీ 295) సైనిక రవాణా విమా నం ఆకాశ వీధిలో చక్కర్లు కొట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో దేశీయ విమానయాన, రక్షణ ఉత్పాదక రంగాల్లో ఇదొక మైలురాయిగా నిలిచింది.
చారిత్రాత్మక విజయంపై ఎయిర్‌బస్ డిఫెన్స్ సంస్థ స్పందిస్తూ.. భారతదేశ రక్షణ రంగ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయమని పేర్కొంది. ఒక ప్రైవేట్ రక్షణ భాగస్వామ్య సంస్థ పూర్తిస్థాయి సైనిక విమానాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారి అని తెలిపింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎయిర్ బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సం యుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. వడోదరలోని టాటా-ఎయిర్‌బస్ ప్లాంట్ నుంచి ఈ విమానం విజయవంతంగా గాలిలోకి దూసుకెళ్లింది.






