బీఆర్ఎస్ నేతలు ఎన్ని డ్రామాలు చేసినా ఫెయిల్
- నీళ్లపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు
- బీఆర్ఎస్ డ్రామాలు చూసి.. వరుణ దేవుడికి కోపమొచ్చింది
- నీటి హక్కులను కేసీఆర్ తాకట్టుపెట్టలేదా?
హైదరాబాద్: నీళ్లపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahabubnagar MLA Yennam Srinivas Reddy) ఆరోపించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలు ఎన్ని డ్రామాలు చేసినా ఫెయిల్ అవుతున్నాయని విమర్శించారు. కరువు వస్తే.. లొల్లి చేద్దామని బీఆర్ఎస్ నేతలు ఆశించారని ఆయన సూచించారు.
బీఆర్ఎస్ నేతల డ్రామాలు(BRS Dramas) చూసి వరుణ దేవుడికి కోపమొచ్చి వర్షం కురిపించారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను(Telangana's water rights) కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తాకట్టుపెట్టలేదా? అని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Project) రూ. లక్ష కోట్లతో కట్టి తెలంగాణను అప్పుల పాలు చేశారని ఆగ్రహించారు. ప్రజల కోసం బీఆర్ఎస్ నేతలు ఏనాడూ ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఏ విషయంపైనైనా అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే సవాల్ చేశారు.






