13 August, 2026 | 4:48 PM

Vote-for-Note: మళ్లీ మొదటికొచ్చిన ఓటుకు నోటు వ్యవహారం

13-08-2026 04:01 PM

న్యూఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంపై విచారణ సుప్రీంకోర్టులో(Supreme Court) మళ్లీ మొదటికి వచ్చింది. కేసు విచారణ జరిపిన జడ్జిల పదవీ విరమణతో మొదటి నుంచి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్లపై తుది విచారణ సమయంలోనే జడ్జిలు పదవీ విరమణ పొందారు. 'పార్ట్ హెడ్ మ్యాటర్' గా సీజేఐ ధర్మాసనం ముందుకు పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఎన్నికల అంశంపై ఏసీబీతో విచారణపై రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పిటిషన్ వేశారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేతలు ఇంప్లీడ్ అయ్యారు. తగిన తేదీ, సమయం కేటాయించనున్నట్లు సీజేఐ ప్రకటించారు. బీఆర్ఎస్ నేతల లాయర్ పార్ట్ హెడ్ అని సీజేఐ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కొత్త కేసుగానే విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తేల్చిచెప్పారు. అనంతరం సీజేఐ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.