13 August, 2026 | 5:13 PM

బైక్ దగ్ధం

13-08-2026 04:02 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామపంచాయతీ శివారులోని గురుదేవ్ తలాబ్  వద్ద  నిదన్ సింగ్ అనే వ్యక్తికి చెందిన  టీవీఎస్ జుపిటర్  బైకు  అగ్నికి పూర్తిగా దగ్ధం అయింది.  గురువారం తీవ్రమైన ఎండ కాయడంతో  ద్విచక్ర వాహనం  వేడెక్కింది. వాహనాన్ని  రోడ్డు పక్కన నిలిపివేశారు. అదే సమయంలో అనుకోకుండా బైక్ నుండి పొగలు వచ్చి  ఒకేసారి మంటలు చెలరేగాయి. దీంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ దగ్ధం కావడంతో  బైక్ యజమానికి 80 వేల నష్టం  జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.