17-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 16: స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. లఢాఖ్ సెక్టార్‌లో 15వేల అడుగుల ఎత్తులో ఈ రక్షణ వ్యవస్థను డీఆర్డీవోతో కలిసి పరీక్షించింది.
ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు చాలా ఎత్తులో ఉన్న సమయంలోనూ వేగంగా క దిలే లక్ష్యాలపై ఆకాశ్ విజయవంతంగా దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్‌సమయంలో పాకిస్థాన్ సైన్యం, చైనా విమానాలు, టర్కిష్ డ్రోన్‌లను ఉపయోగించి చేసిన వైమానిక దాడులను అడ్డుకోవడం వ్యవస్థ పనిచేసిందని రక్షణ అధికారులు తెలిపారు.
ఆకాశ్ ప్రైమ్ అనేది డీ ఆర్డీవో రూపొందించిన అ ధునాతనమై, స్వ దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన స్మాల్ రే ంట్ సర్ఫేస్ టూ ఎయిర్ మి స్సైల్ వ్యవస్థ. ఈ వ్యవస్థ వైమానిక దాడుల నుంచి కీల కమైన ప్రాంతాలు, పాయింట్లను రక్షించేందుకు రూపొందించింది.