calender_icon.png 17 July, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు వర్ష సూచన

17-07-2025 09:21:39 AM

హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీంతో తెంలగాణలో(Telangana) ఇవాళ, రేపు భారీ వర్షాలు(Rain) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం తెలంగాణలోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. నేడు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగితా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.