12 May, 2026 | 12:24 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

17-07-2025 09:10 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. 75,104 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 31,896 మంది భక్తులు నిన్నశ్రీవారికి తలనీలాలు సమర్పించారు. బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పుష్ప పల్లకి సేవలో పవిత్రమైన సాలకట్ల ఆణివార ఆస్థానంలో, శ్రీదేవి-భూదేవిలతో కలిసి శ్రీ మలయప్ప స్వామి తిరుమల మాడ వీధుల వెంబడి గొప్ప పూల పల్లకీ ఊరేగింపులో భక్తులను ఆశీర్వదించారు.