17-07-2025 10:12:31 AM
హైదరాబాద్: సనత్ నగర్(Sanath Nagar) పరిధిలోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ ప్లేట్స్, డిన్నర్ సెట్స్ ప్యాకింగ్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని డీఎఫ్ వో వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.