17-07-2025 12:00:00 AM
- కేరళ నర్సు కేసులో కీలక మలుపు
- నిమిషకు ఉరిశిక్ష పడాల్సిందే: మృతుడి సోదరుడు
- మాకు డబ్బు కాదు న్యాయం కావాలి
న్యూఢిల్లీ, జూలై 16: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిమిషకు ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా పడిందన్న అంశం కాస్త ఊరట కలిగిందనుకునేలోపే మృతుడి సోదరుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మృతుడు తలా ల్ అదిబ్ మెహది సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది.. ‘బ్లడ్ మనీ’కి (క్షమాధనం) అంగీకరించమని.. నిమిషకు శిక్ష పడాల్సిందేనం టూ పేర్కొన్నారు. నిమిష శిక్ష అమలు వాయిదా పడటంపై అబ్దుల్ ఫత్తా సామాజి క మాధ్యమంలో పోస్టు పెట్టారు. ‘ఈ వాయిదాను మేము ఊహించలేదు. మా కుటుం బం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రతిపాదన లు అన్నింటినీ తిరస్కరించింది. ఈ ప్రయత్నాలు మాకు కొత్తేమీ కావు. ఎన్ని విధాలా ఒత్తిడి చేసినా మా అభిప్రాయాన్ని మార్చుకోం.
బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదు. నా సోదరుడిని హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష పడి తీరాల్సిందే. క్షమాపణ అనే మాటే లేదు. మాకు కావాల్సింది డబ్బు కాదు.. న్యాయం’ అని స్పష్టం చేశారు. యెమెన్‌లో దోషిగా తేలిన నిమిషను భారతీయ మీడియా బాధితురాలిగా చిత్రీకరిస్తోం దని మండిపడ్డారు. యెమెన్ చట్ట ప్రకారం మరణించిన వ్యక్తి కుటుంబం నిందితులను క్షమించి పరిహారానికి అంగీకరిస్తే శిక్షను రద్దు చేయొచ్చు.
అందుకే ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ యెమెన్ స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌తో నిరంతర చర్చలు జరుపుతోంది. మరోవైపు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మృతుడి కుటుంబంతో క్షమాధనానికి ఒప్పుకునేందుకు తీవ్ర చర్చలు జరిపారు. నిమిష కుటుంబం బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 కోట్లు) క్షమాధనం ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
తాజాగా బ్లడ్‌మనీకి మృతుడి కుటుంబం అంగీకరించకపోవడంతో ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2011లో యెమెన్ వెళ్లి ఉద్యోగంలో చేరారు. యెమెన్‌కు చెందిన తలాల్ అదిబ్‌ను వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు.
అదిబ్‌కు మత్తు మందు ఇచ్చి చంపిన కేసులో యెమెన్ స్థానిక కోర్టు నిమిషకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఉరిశిక్ష తీర్పును సవాల్ చేస్తూ యెమెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిమిషకు అక్కడా చుక్కెదురైంది. ఆమె పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను అమలు చేయాలంటూ తీర్పునిచ్చింది.