17-07-2025 10:57:16 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని(Bejjur mandal) కొత్తగూడ గ్రామానికి చెందిన లెండిగురి భీమ్రావు(58) ఉరివేసుకొని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సర్తజ్ పాషా తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లేండుగురి భీమ్రావు భార్య గత ఏడు సంవత్సరాల క్రితమే చనిపోయింది. భార్య మృతి చెందడంతో భర్త మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి పుట్టి, బాధతో తన సొంత చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట పొలాల వైపు వెళ్లిన రైతులు, పక్క చేను రైతు శంకర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి ఎస్ఐ చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. పక్క చేను రైతు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.