19 May, 2026 | 10:19 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

అక్షర చిట్‌ఫండ్ చైర్మన్ అరెస్ట్

18-03-2026 01:51 AM
  1. ఎట్టకేలకు చిక్కిన శ్రీనివాసరావు 

రాష్ట్ర వ్యాప్తంగా 96 కేసులు 

కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన వైనం

ఆదిలాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): అక్షర చిట్ ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టి, కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అక్షర చిట్ ఫండ్ మేనే జింగ్ డైరెక్టర్, చైర్మన్ పేరాల శ్రీనివాస్‌రావును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వాటర్‌లో మీడియాకు ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రావుపై టూ టౌన్‌లో 12 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్‌లో చిట్టీలు కట్టిన బాధితులు రూ.99 లక్షలు చెల్లించగా, వారికి తిరి గి చిట్ ఫండ్ నుంచి రూ. కోటి 11 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు.

గత కొన్ని  సంవత్సరాల క్రితం చిట్ ఫండ్ బోర్డు తిప్పేసి, కోట్లాది రూపాయలను కొల్లగొట్టినట్లు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 96 కేసులు నమోదు కాగా, గత 6 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. సోమవా రం అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రైవేట్ చిట్ ఫండ్ ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, టూ టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ అఖిల్, ఆర్‌ఎస్‌ఐ గోపికృష్ణ, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.