03-11-2025 04:47:54 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయాలు కల్పించడం సంతృప్తికరమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం అక్షయపాత్ర ఫౌండేషన్ భారతదేశంలో సేవలందిస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలి వల్ల చదువుకు దూరం కాకుండా పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించటం ఈ అక్షయపాత్ర సంస్థ ముఖ్య లక్ష్యమన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని వేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు.
అనంతరం ఎమ్మెల్యేగ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరం అని, ఆకలితో ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగకుండా అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవ అభినందనీయం అని ఆయన చెప్పారు. ఒక మంచి కార్యక్రమానికి మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందుకు నిర్వాహకులకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పారిశ్రామిక గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య, మహిళా అధ్యక్షురాలు నవనీత, కార్యనిర్వాహాక అధ్యక్షులు చెన్నయ్య, రఘు దాసరి, ఎంఇఓ గోపాల్ నాయక్ మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.