03-11-2025 04:53:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అదనపు కలెక్టర్ కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.