నీట మునిగిన పంట పొలాలను కాపాడండి
రామగిరి (విజయక్రాంతి): మండలంలోని ఆదివారపేట గ్రామానికి చెందిన లద్నాపూర్ శివారులోని పంటపొలాలు అర్జీ-3 డివిజన్ ఓసిపి-2 బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంట పొలాలను కాపాడాలని సోమవారం మాజీ జెడ్పిటిసి మైదా భారతి వరప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు పంట పోలాలను పరిశీలించాలని, అనంతరం రామగిరి తహసీల్దార్ కు వినతిపత్రం షాక్ అందజేశారు.
తహసీల్దార్ సూచన మేరకు ఓసిపి-2 ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణకు కలసి నష్ట తీవ్రతను వివరించిగా వెంటనే రెండు జెసిపిలు ఏర్పాటు చేసి 24 గంటలలో నీటిని తొలగించాలని సంబంధిత అధికారులను అదేశించారని, బ్యాక్ వాటర్ ను వెంటనే తొలిగించి రైతుల పంట పొలాలను కాపాడి ఆదివారం పేట, లద్నాపూర్ రైతులకు న్యాయం చేయాలనీ రామగిరి తహసీల్దార్ సుమాన్ ను సింగరేణి ప్రాజెక్ట్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మైదం వరప్రసాద్, ముత్తారం పీ ఏసీఎస్ ఉపాధ్యక్షులు ఎలువక కొమురయ్య, నాయకులు ఇల్లందుల సంజీవ్, మెండే ఓదెలు, మైదాం సుధాకర్, నాంసాని కుమార్, చిప్ప చంద్రయ్య, ఎలువక రాజ్ కుమార్ పాల్గొన్నారు.




