17 August, 2026 | 3:00 AM

సామజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఆకుల సుభాష్ ముదిరాజ్

17-08-2026 02:11 AM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 16 (విజయ  క్రాంతి):సామజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులుగా ఆకుల సుభాష్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సామాజిక న్యాయ వేదిక జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

అనంతరం జిల్లా అధ్యక్షులగా ఆకుల సుభాష్ ముదిరాజ్ ఉపాధ్యక్షులుగా  బత్తుల శ్రీధర్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా పెద్ద రవి  గౌరవ అధ్యక్షులుగా  డామేరుప్పుల మధు స్వామి కార్యదర్శి గా  చెందిన బానోతూ రాజు నాయక్ సహాయ కార్యదర్శి గా ముత్తోజు వీణ చారి కోశాధికారి గా పసునూటి శంకర్ కార్యదర్శి  సరువు కుమారస్వామి రాష్ట్ర అధ్యక్షులు యెషబోయిన సాంబయ్య యాదవ్ అధ్యక్షతన నూతన కమిటీని నియమించారు.

ఈ కార్యక్రమం లో ఎస్ టీ సామజిక రాష్ట్ర అధ్యక్షులుధరవత్ దేవా నాయక్ సామాజిక రాష్ట్ర నాయకులు బుర్ర రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంపటి భువన సుందర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాటి కంటి రవికుమార్ సామజిక గౌరవ సలహాదారులు రొంటాల లింగారెడ్డి కుంట్ల ఉప్పలయ్య మాజీ సర్పంచ్ మోర రాజన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.