8 May, 2026 | 9:22 AM

అల్‌ఖైదా టెర్రర్ మాడ్యుల్ మాస్టర్ మైండ్ అరెస్ట్

31-07-2025 12:44 AM
  1. బెంగళూరులో షామా పర్వీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కర్ణాటక నుంచి ఉగ్రవాదులకు సాయం అందిస్తున్నట్టు గుర్తించిన అధికారులు

బెంగళూరు, జూలై 30: అల్‌ఖైదా టెర్రర్ మాడ్యుల్ మాస్టర్ మైండ్ ఏండ్ల షామా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరె స్ట్ చేసినట్టు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్కాడ్ అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని గుర్తించడానికి అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగానే పర్వీన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా ఆమె కర్ణాటక నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహి స్తున్నట్టు అధికారులు గుర్తించారు.

జూలై 23న ఈ మాడ్యుల్‌తో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురు ఉగ్ర అనుమానితులను గుజరాత్, ఢిల్లీ, నోయిడాలో అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. వీరంతా సోషల్ మీడియాలోని ఓ రహస్య ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారని.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ సభ్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

వారందరికీ షామా పర్వీన్ నాయకత్వం వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఉగ్ర దాడులు అమలకు పాల్పడేందుకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అల్‌ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్‌సెల్ విభాగంతో, విదేశాల్లోని ఉగ్ర సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయని.. దేశానికి సంబంధించిన అతి సున్నితమైన సమాచారాన్ని వీరు ఉగ్ర ముఠాలకు పంపుతున్నారని అధికారులు పేర్కొన్నారు.