ఉగ్రవాదులకు అడ్డాగా టన్నెల్
- సొరంగాన్ని నీటితో నింపిన ఆర్మీ
చివరకు ఎన్‌కౌంటర్‌లో హతం
బెడిసికొట్టిన ఉగ్రవాదుల ప్లాన్
ముష్కరులను పట్టించిన టన్నెల్
శ్రీనగర్, జూలై 30 : పహల్గాం హత్యాకాండలో పాల్గొన్న ఉగ్రవాదులను ‘ఆపరేష న్ మహదేవ్’ ద్వారా హతమార్చినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులను ఎలా ట్రాక్ చేసి చంపేసిన విధానాన్ని ఆయన వివరించారు. ‘పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు చివరిసారిగా ఏకే ఎం తుపాకులను ఉపయోగించారు.
ఘటన అనంతరం వారు తిరిగి పాకిస్థాన్‌లోకి వెళ్లకుండా భద్రతా దళాలు వ్యూహం పన్నాయి. దీంతో ఎటూ తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఉగ్రవాదులు సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ ఎవ రికంట పడకుండా ఓ టన్నెల్‌లో దాక్కున్నా రు. దీంతో ఉగ్రవాదుల జాడ తెలుసుకోవాలని హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఘటన జరిగిన అనంతరం ఉగ్రవాదులు పారిపోకుండా ఉండడానికి వారు సంచరించిన ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని అణువణువు జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలో శ్రీనగర్ సమీపంలోని లిడ్డాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్న టెన్నెల్‌ను బలగాలు గుర్తించాయి. ఆపద వచ్చినపుడు ఈ సొరంగం నుంచి పారిపోయేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారు. వారిని బయ టకు రప్పించడానికి సొరంగంలోకి నీటిని పంపి వరదలతో నింపారు. దీంతో ఉగ్రవాదులు టన్నెల్ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తరువాత లిడ్వాస్ ప్రాంతంలోని పార్క్‌లో ఏర్పాటు చేసుకున్న గుడారాలను భద్రతా బలగాలు ట్రాక్ చేసి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించి ఎన్‌కౌంటర్ చేశాయి.
ఈ ఘటనలో సులేమాన్, ఆఫ్గానీ, జిబ్రా న్ అనే పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయి బా తీవ్రవాదులు హతమయ్యారు. నిద్రపోతున్న ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశాయి. ఘటనా అనంతరం వారి నుంచి రెండు ఏకే ఒక ఎం తుపాకులను స్వాధీ నం చేసుకున్నాయి. అయితే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారికి పహల్గాం దాడితో సంబంధం ఉందో లేదో తెలుసుకోవడానికి ఆ తుపాకులను చండీగడ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. ఆ తుపాకుల నుంచి బుల్లెట్లను నిపుణులు పేల్చి చూశారు. ఆ తరువా త పహల్గాం వద్ద దొరికిన తుటాలతో ఈ ఖాళీ తూటాలను పోల్చి చూశారు.
ఈ రెండు 100 శాతం సరిపోలడంతో పహల్గాం హత్యాకాండకు వాడింది ఈ తుపాకులేనని ఆరుగరు ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేశారు. ఆపరేషన్ మహదేవ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడు తూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులు పహల్గాం దాడిలో పాల్గొన్న వారేనని శాస్త్రీయంగా నిర్ధారించామన్నారు. ఈమేరకు తగినన్ని ఆధారాలుఆధారాలు సేకరించామని ఆయన స్పష్టం చేశారు.






