అల్ ఉగ్ర కుట్ర భగ్నం
ఢిల్లీ, ఆగస్టు 22: ఢిల్లీ పోలీసులు ఆల్ కుట్రను విచ్చిన్నం చేశారు. గురువారం ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఉగ్రకుట్రను భగ్నం చేసి జార్ఖండ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయా రాష్ట్ర పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. .. ‘రాంచీకి చెందిన డాక్టర్ ఇస్తియాక్ ఈ కుట్రకు నేతృత్వం వహించారు. దేశ వ్యాప్తంగా ఉగ్ర దాడులకు పాల్పడేందుకు వీరు సిద్ధమయ్యారు. ఈ టీమ్ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో ఆయుధాల వాడకం ఎలా చేయాలన్న దాంట్లో శిక్షణ పొందారు’ అని పేర్కొన్నారు. రాజస్తాన్‌లోని భీవండి నుంచి ఆరుగురిని, యూపీ, జార్ఖండ్ నుంచి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇంకొన్ని ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.






