ఇక పీఎఫ్ క్లెయిమ్స్ తేలికే
23-08-2024 12:06 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్ ఉన్న ఉద్యోగులు ఏవైనా దరఖాస్తులు చేసే వాటి ని క్లెయిమ్ చేసుకోవటానికి నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తున్నది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఈపీఎఫ్‌వో తన వెబ్‌సైట్, యాప్‌లలో ఐటీ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే త్రైమాసికం నుం చి ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ 2.01ను అందుబాటులోకి తేనున్నట్టు గురువారం ప్రకటించింది. కొత్త ఐటీ సిస్ట మ్‌పై కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించి నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.






