23 April, 2026 | 1:25 AM

అగ్రరాజ్యంలో ఓం శాంతి

23-08-2024 12:05 AM

చికాగో, ఆగస్టు 22: అగ్రరాజ్యం అమెరికాలో “ఓం శాంతి.. ఓం శాంతి” మంత్రోచ్చారణలు మార్మోగాయి. చికాగోలోని డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో వేదపండితుడు రాకేష్ భట్ ఆధ్వర్యంలో మూడో రోజు కూడా ఘనంగా పూజలు నిర్వహించారు. రాకేశ్ భట్ సంస్కృత భాషలోని వేదాక్షరాలను ఇంగ్లిష్‌లోకి అనువదించి అక్కడున్న శ్రోతలకు అర్థం చెప్పారు. ఆయన తన ప్రసంగం చివరలో “ఓం శాంతి శాంతి” అని పలికారు. ఇక డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ గురువారంతో ముగిసింది. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హరిస్, టిమ్ వాల్జ్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా పోటీకి నిలిచిన విషయం తెలిసిందే. ఇండో అమెరికన్ల ఓట్లు ఎవరికి పడతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. ‘మనలో మనకు ఎన్ని బేధాబిప్రాయాలు ఉన్నా కానీ.. దేశం విష యానికి వస్తే మనమంతా ఒక్కటే.  సమాజశ్రేయస్సు కొరకు మన మనసు ఒకే విధంగా పరితపించాలి’ అని రాకేశ్‌భట్  నీతిబోధనలు చేశారు.