13న అలయ్ బలయ్
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అలయ్ బలయ్ అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ప్రస్తుత హర్యానా గవర్నర్, నాటి బీజేపే సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. ఆయన ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అలయ్ బలయ్ వేడుక తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించారు.






