08-08-2025 01:55:10 AM
రూ.11 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం
అలంపూర్, ఆగస్టు, 07: అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు.వివరాల్లో కి వెళ్తే...అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ మెజర్మెంట్ రికార్డు చేసే విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ నుండి డీఈ శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశారు.సుమారు నాలుగు లక్షలకు సంబంధించిన పని కోసం మూడు శాతం కమీషన్ కావాలని డిమాండ్ చేశారు.
అందులో భాగంగా రూ.11 వేల రూపాయలు ఇవ్వాలని కోరగా.. అందుకు ఇష్టపడని ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.ఏసీబీ అధికారుల సూచన మేరకు లంచం ఇస్తుండగా డీఎస్పీ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పి తెలిపారు.కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎండీ ఖాదర్ జిలానీ ,సిబ్బంది పాల్గొన్నారు.