calender_icon.png 8 August, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ సన్నిధిలో ఆర్బీఐ ఉన్నత అధికారులు

08-08-2025 01:55:06 AM

అలంపూర్, ఆగస్టు 07:  తెలుగు రాష్ట్రాల ఆర్బిఐ లోకాయుక్త సిజిఎం డాక్టర్ సింగాల సుబ్బయ్య గురువారం అలంపురం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయాలను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఉన్నారు.

జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు 

అలంపూర్,ఆగస్టు 07: అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు గురువారం దర్శించుకున్నారు.వారికి దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం బహుకరించి ఆశీస్సులు అందజేశారు. వీరి వెంట నాయకులు ఆదిత్య రెడ్డి , రఘు రెడ్డి, సదానందం, వెంకటేష్ తదితరులు ఉన్నారు.