17-01-2026 08:38:21 PM
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ అనిత శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.