16 March, 2026 | 8:28 PM

శాంతి సోదర భావానికి ప్రతీక... రంజాన్ పర్వదినం

16-03-2026 07:26 PM

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్(విజయక్రాంతి): శాంతి సోదర భావం సౌబ్రాతృత్వానికి ప్రతీక రంజాన్ పర్వదినం అని, సేవా నిరతికి, పరోపకారానికి రంజాన్ మాసం ఉన్నతమైనదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ నైస్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు" రంజాన్ తోఫా" పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని సర్వ మానవ శ్రేయస్సుయే రంజాన్ పర్వదిన సందేశమని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా తోఫా కార్యక్రమం నిర్వహించడం ముదాబావమన్నారు. రంజాన్ పర్వదినం శాంతి సోదర భావానికి సేవాభావానికి ప్రతీక అని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండి సంక్షేమంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలబడడం సంతోషమన్నారు.

అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, వేణు, సతీష్ గౌడ్, మహమ్మద్ ఫారూఖ్, పాషా మియా, కాలేశా, యూసుఫ్ పఠాన్, ఉమర్, అనంతలక్ష్మి, చింత విజయ,  సునీత, రజిత గోపాల్, లత, సునీత, ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.