calender_icon.png 17 January, 2026 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా

17-01-2026 08:56:56 PM

 విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో గృహ వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి విద్యుత్ వినియోగదారుడికి విశ్వసనీయ సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రజాబాట–పొలంబాట కార్యక్రమం ద్వారా అధికారులు గ్రామాలు, కాలనీల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తున్నారని  తెలిపారు.విద్యుత్ లోపాలను త్వరగా సరిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా 214 విద్యుత్ అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వేములవాడ నియోజకవర్గంలో 13 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు చేయడంతో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ సంస్కరణలపై సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున అధికారులు విప్‌కు అందజేశారు.