17 April, 2026 | 5:47 PM

2.8లక్షల విలువైన అల్ఫాజోలం పట్టివేత

06-06-2025 12:21 AM

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్కెట్ యార్డు

పెబ్బేరు జూన్ 5: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇద్దరు వ్యక్తులతో 5 10 గ్రాముల ఆల్ఫాజోలం ను గురువారం మధ్యాహ్నం పోలీసులు పట్టుకున్నారు. కల్తీ కల్లు తయారు చేయటంలో నిషేధిత ఆల్ఫాజోలం ను విరివిగా ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో రెక్కీ నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మిగతావారు పరారయ్యారని.

గద్వాల జిల్లా, బింగిదొడ్డి గ్రామానికి చెందిన ఈడిగ నర్సింహ గౌడు, తుమ్మల పల్లి కి చెందిన ఈడిగ భాస్కర్ గౌడ్ లను అదుపులోకి తీసుకోగా వారి వద్ద 250గ్రాములు, 260 గ్రాముల ఆల్ఫాజోలం లభించింది. ఆర్ ఐ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి వారిని స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్టేషన్ హౌస్ అధికారి యుగేందర్ రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.