calender_icon.png 8 June, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రాకు చెందిన 26 బీసీ కులాలను తిరిగి తెలంగాణలో చేర్చకూడదు

06-06-2025 12:22:56 AM

తెలంగాణ బీసీ (ఏ) కులాల హక్కుల పరిరక్షణ సమితి 

ఖైరతాబాద్; జూన్ 5 ( విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి తొలగించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన 26 కులాలు, పర్యాయపదమైన శెట్టిబలిజ కులాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో చేర్చకూడదని తెలంగాణ బీసీ (ఏ) కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చసిన విలేకరుల సమావేశంలో.సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాగయ్య, అధ్యక్షుడు నరహరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, గౌరవ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుడు తెలంగా ణ విటల్ లు హాజరై మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు అన్యాయం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని దుయ్యబట్టారు.

ఆంధ్ర పెత్తందార్ల వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని గ్రామ గ్రామాన ఉవ్వెత్తున లేచిన ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. అట్టి రాష్ట్రం మరల ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్తుందని ఆరోపించారు. ఇప్పటికే హైదరాబాదులో రెస్టారెంట్లు, సినీరంగం, విద్యారంగం, వైద్యరంగం లలో ఆంధ్ర పెత్తనమే కొనసాగుతుందని తెలిపారు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన 26 కులాలను మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కులంలో చేర్చడం ద్వారా తెలంగాణ బీసీలు విద్య ఉద్యోగ అలలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఏ కులం ల ఉన్న రజక, నాయి బ్రాహ్మణ, గంగపుత్ర, బెస్త, దాసరి, బుడబుక్కల, జంగమ ఇలా మొత్తం 38 కులాలకు చెందిన సభ్యులు రాజకీయంగా దారిద్రరేఖకు దిగువనే ఉన్నారని తెలిపారు.

స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తయిన బీసీ కులాలు మాత్రం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఆంధ్ర ప్రాంతానికి చెందిన 26 కులాలను తెలంగాణ ప్రాంతంలోని బీసీలో  చేర్చకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.