5 May, 2026 | 9:19 PM

పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ

05-05-2026 07:57 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రాథమిక సహకార సంఘం (PACS) ఆసిఫాబాద్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు పారదర్శకంగా రుణాలు, సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.