17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఎన్టీఆర్ సినిమాలో అలియా!

15-04-2026 01:34 AM

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి తెలిసిం దే. హిందీ లో తక్కువ సమయంలోనే తన దైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. ‘గంగుబాయి కతియవాడి’ వంటి సినిమాతో జాతీయ అవార్డు అందుకుంది. గ్లామరస్ కథానా యికగా ఆకట్టుకుంటూనే అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఇదివరకే తెలుగులో ఓ సినిమాలో కనిపించి దక్షిణాది సినీ ప్రియుల హృదయాలను గెలుచుకుంది అలియా.

తాజాగా ఈ అమ్మడు మరోసారి తెలుగు తెరపై సందడి చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ప్రస్తుతం ‘డ్రాగన్’ పేరుతో ప్రచారంలో ఉంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో భామ అలియా భట్ అడుగుపెడుతోందని టాక్. ప్రశాంత్ నీల్ ఓ పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేశారని.. ఆ రోల్ కోసం అలియా పేరును పరిశీలిస్తున్నారని టాక్. గతంలో అలియా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో సీత పాత్రలో కనిపించింది. ఇది ఖరారైతే మరోసారి తెలుగు సినీప్రియులను అలియా అలరించడం ఖాయమని తెలుస్తోంది.