నాగిరెడ్డిపేట్ మండలంలో 365 విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు
పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నేడు నాగిరెడ్డిపేట్ మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.మొత్తం నాగిరెడ్డిపేట్ మండలంలో 365 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు మండల ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.పదవ తరగతి పరీక్షలు రాయనున్న 365 మంది విద్యార్థులలో జడ్పీహెచ్ఎస్ గోపాల్పేట్ పాఠశాలలో 87 విద్యార్థులు,తెలంగాణ మోడల్ స్కూల్లో 88 విద్యార్థులు,జడ్పీహెచ్ఎస్ మాల్తుమ్మెద పాఠశాలలో 30 విద్యార్థులు,జెడ్పిహెచ్ఎస్ తాండూర్ పాఠశాలలో 23 విద్యార్థులు జడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్ 19 విద్యార్థులు, జడ్పీహెచ్ఎస్ బొల్లారం 46 విద్యార్థులు,కేజీబీవీ పాఠశాలలో 43 విద్యార్థులు, శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన 29 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు మండల ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.
అయితే నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల సెంటర్లో 200 పరీక్ష రాయడం జరుగుతుంది. మరియు తెలంగాణ మోడల్ స్కూల్లో 165 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు.గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ సెంటర్ వద్ద సిఎస్.సత్యనారాయణ,డివో మాణిక్యం,తెలంగాణ మోడల్ స్కూల్లో సిఎస్. వెంకటేశ్వరరావు,డివో మహేందర్ రెడ్డి పరీక్ష కేంద్రం పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందని మండల ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మండల ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు సమయానుసారం పాటించి పరీక్షలకు హాజరు కావాలన్నారు.ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించడం జరగదు అన్నారు.




